జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ తో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్టు చేసిన తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆ ఫొటో నేపథ్యంలో రాజకీయ వివాదం మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పవన్ తో కలసి ఫొటో దిగడమేంటని కొందరు తెలంగాణవాదులు కేటీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో మంత్రిగా.. తెలంగాణ వాదిగా తెలంగాణలో మంచి ఇమేజి తెచ్చుకున్న కేటీఆర్ కు అది ఇబ్బందికరంగా మారింది.
ఒకప్పుడు కేసీఆర్ కుటుంబమంతా పవన్ కల్యాణ్ పై ఎన్నో విమర్శలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నికల ప్రచారం సమయంలో పవన్ పై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేరు. కవిత కూడా పలు సందర్భాల్లో పవన్ ను విమర్శించారు. ఈ నేపథ్యంలో, కేటీఆర్ పై ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రాంతానికి చెందిన నెటిజన్లు విమర్శిస్తున్నారు. పవన్, కేటీఆర్ ల కలయికను ఇష్టపడటం లేదని ఓ నెటిజన్ డైరెక్టుగా తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
తెలంగాణను వ్యతిరేకించిన పవన్ తో సెల్ఫీ దిగడానికి కేటీఆర్ ఆసక్తి చూపడం తమకు నచ్చలేదని నెటిజన్లు అంటున్నారు. అయితే.. మరికొందరు నెటిజన్లు మాత్రం కేటీఆర్ ను ప్రశంసిస్తున్నారు. చేనేత రంగాన్ని ప్రోత్సహిస్తున్న పవన్ కల్యాణ్ పట్ల టెక్స్ టైల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కు అభిమానం ఉండటంలో తప్పులేదని... ఆ అభిమానంతోనే సెల్ఫీ దిగారని కొందరు అంటున్నారు. మొత్తానికి కేటీఆర్ కు ఈ సెల్ఫీ పెద్ద చిక్కే తెచ్చినట్లుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/