పవన్ మారిపోయాడు. తన తప్పును తెలుసుకున్నాడు. తన ఓటమికి అభిమానుల అత్యుత్సాహమే కారణమని నిండు సభలో ఒప్పుకున్నాడు. ఉవ్వెత్తున ఎగిసే పవన్ ఇలా తనలో తాను పరిపూర్ణుడిగా మారడానికి.. తప్పు తెలుసుకోవడానికి కారణం ఏమయ్యింటుందా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. పవన్ కు చాలా దెబ్బ పడ్డాకే ఈ పశ్చాత్తాపం.. పరిపూర్ణత వచ్చిందని జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇటీవల మదనపల్లెలో జనసేన కార్యకర్తల సమావేశం జరిగిందట.. ఈ సమావేశంలో అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన సాకే పవన్ జనసేనాని పవన్ ముందే తమ అధినేత ఆదేశిస్తే ‘రెడ్ల తలను నరుకుతాం’ అంటూ కామెంట్ చేశారు. దీన్ని పవన్ కూడా సమర్థించాడు.
రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి సామాజికవర్గంలో ఈ వ్యాఖ్యలపై ఆందోళనలు మొదలయ్యాయి. సొంత జనసేన పార్టీలోని రెడ్లు కూడా పవన్ పై తీవ్ర మనస్థాపం చెందారట.. ఇక రెడ్డి కులస్థులందరూ దీనిపై పవన్ పై కేసులు పెట్టారు. వైసీపీ రెడ్లు అయితే నీ తలే తీస్తామంటూ నోరుపారేసుకున్నారు. రెడ్డి మహిళలు కూడా పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు..
దీంతో తప్పు తెలుసుకున్న పవన్.. తన కార్యకర్తల అత్యుత్సాహం వల్లే తనకు ఇబ్బందులు అవుతున్నాయని.. ఆ వేడి వల్ల తనకు.. తన పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని.. కొన్ని సామాజికవర్గాలు దూరమవుతున్నాయన్న సత్యం తెలిసివచ్చిందట.. అందుకే ఇప్పుడు తనకు బలంగా ఇన్నాల్లు ఉన్నా కార్యకర్తలే తన బలహీనత అని పవన్ ఆవేదన వ్యక్తం చేశాడట.. వారి వల్లే ఓడిపోయానని వాపోతున్నాడట..తనతో సెల్ఫీలు తీసుకుంటున్న వాళ్లు కూడా తనకు ఓటు వేయడం లేదని పవన్ వాపోయారట.. ఇలా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా పవన్ తీరు మారిందట.. అయినా ఆవును పొలంలో మేస్తుంటే.. దూడ చెట్టును మేస్తుందా అన్న సామెత ఉండనే ఉంది కదా అని సీనియర్ నేతలు ఈసడించుకుంటున్నారట.