తమిళ కథ సుఖాంతం అనుకున్న వేళ.. మరో కొత్త కథ మొదలైంది. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ - మాజీ సీఎం జయలలిత నెచ్చెలి శశికళ పెరోల్ పై ఇలా విడుదలయ్యారో లేదో గాని తమిళ రాజకీయాలు మళ్లీ రసవత్తరంగా మారాయి. ఇప్పుడిప్పుడే అక్కడి పరిస్థితులు కొలిక్కి వస్తాయనుకున్న తరుణంలో.. సీఎం పళనిస్వామి అనుచరుడు చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీ అన్నాడీఎంకేలో దుమారం రేపుతున్నాయి. ఇన్నాళ్లూ చిన్నమ్మకు షాకుల మీద షాకుల ఇస్తూ ఉన్న ఈపీఎస్ - ఓపీఎస్ కు.. దిమ్మతిరిగే షాకిచ్చారు మంత్రి సెల్లూర్ రాజు! ఈపీఎస్ అనుచరుడిగా ఉంటూనే.. చిన్నమ్మను పొగుడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
*అమ్మ(జయలలిత) ప్రభుత్వం మెరుగైన పాలన అందించేందుకు చిన్నమ్మ(శశికళ) ఎంతో కష్టపడి పనిచేశారు*... ఇవీ ఎవరో శశికళ వర్గపు నేత చేసిన వ్యాఖ్యలు కాదు. సీఎం ఈ పళని స్వామి అనుచరుడు, మంత్రి సెల్లూర్ రాజు చేసిన సంచలన వ్యాఖ్యలు! అన్నాడీఎంకేలో ఇక చిన్నమ్మ పేరు వినిపించకూడదని ఈపీఎస్ - ఓపీఎస్ ఎంతగానో ప్రయత్నం చేస్తున్నా.. ఎమ్మెల్యేల్లో ఉన్న `చిన్నమ్మ` భక్తి పొంగి పొరలుతోంది. అడ్డుకట్ట వేయాలని శ్రమిస్తున్నా.. ఆ కంచెలన్నీ దాటుకొచ్చేస్తోంది! ఇదే ఇప్పుడు ఈపీఎస్ - ఓపీఎస్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది! అయితే అకస్మాత్తుగా చిన్నమ్మను గుర్తుచేసుకోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది!
తమిళనాడు మంత్రి సెల్లూర్ రాజు చేసిన వ్యాఖ్యలు పాలక అన్నాడీఎంకేలోని ఓపీఎస్ - ఈపీఎస్ గ్రూపుల్లో కలకలం రేపాయి. అమ్మ(జయలలిత) ప్రభుత్వం మెరుగైన పాలన అందించేందుకు చిన్నమ్మ(శశికళ) కష్టపడి పనిచేశారని సెల్లూర్ రాజు వ్యాఖ్యానించారు. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం అని కూడా ఆయన అన్నారు. ఆయన వ్యాఖ్యలతో తమిళనాడు సర్కార్ కు సారథ్యం వహిస్తున్న అన్నాడీఎంకేలోని ఇరు వర్గాలూ షాక్ కు గురయ్యాయి. అవినీతి కేసులో జైలు పాలయిన శశికళతో విభేదిస్తూ అత్యధిక ఎంఎల్ ఏలను తమవైపు తిప్పుకోవడంలో పళనిస్వామి - డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలు దాదాపుగా విజయం సాధించారనే చెప్పాలి. అయితే మంత్రి సెల్లూర్ రాజు ఇప్పుడు చేసిన వ్యాఖ్యలతో ఈపీఎస్ - ఓపీఎస్ వర్గాలకు గట్టి ఎదురు దెబ్బ తప్పదన్న వాదన వినిపిస్తోంది.