వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్ ఏంటి..? బుధవారం రంగా 30వ వర్థంతి. ఈ సందర్భంగా.. ఏదో ఒక కీలక ప్రకటన చేస్తాడని అందరూ అంచనా వేశారు. కానీ రాధా మాత్రం ఎలాంటి ప్రకటన చేయకుండా సైలెంట్ గా ఉండిపోయారు.
ప్రస్తుతం రాధా ఏ పార్టీ లేడు. మొదట కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్లారు. అది కాస్తా కాంగ్రెస్ లో కలిసిపోవడంతో.. వైసీపీలో జాయిన్ అయ్యారు. విజయవాట సెంట్రల్ సీటు ఆశిస్తున్న రాధాను బందరు పార్లమెంట్ నుంచి పోటీ చేయమని పార్టీ నుంచి ఆదేశాలు రావడంతో.. మనస్థాపంతో ఆయన వైసీపీ నుంచి కూడా బయటకు వచ్చేశారు. ఆయనముందున్న ఆప్షన్స్ రెండే రెండు. ఒకటి టీడీపీ. తన తండ్రిని చంపిన పార్టీ అని రాధా ఎప్పుడూ టీడీపీని విమర్శిస్తూనే ఉంటారు. సో.. అందులోకి వెళ్లే అవకాశమే లేదు. రెండో ఆప్షన్ జనసేన. జనసేనకు కృష్ణాజిల్లాలో బలమైన లీడర్ లేడు. అదీగాక జనసేనకు కాపుల పార్టీ అనే ముద్ర కూడా పడింది. ఇలాంటి టైమ్‌లో కాపునాయకుడిగా బలంగా ఉన్న రాధా.. జనసేనకు వెళ్లడం మినహా వేరే ఆప్షన్ లేదు. మరో వైపు.. ఇప్పటికే.. జనసేనకు - రాధాకు చర్చలు కూడా జరిగాయని - రేపోమాపో ఎనౌన్స్ మెంట్ ఉంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి.