ఉత్తరప్రదేశ్ లో రైతులకు రుణమాఫీ విషయంలో ప్రధాని మోడీపై విమర్శలు కురిపించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు క్లారిటీ ఇచ్చారు. ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని భారతీయ జనతా పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగతా రాష్ట్రాలను పట్టించుకోకుండా ఆ రాష్ట్రానికి కేంద్రం అటువంటి ప్రకటన చేయడం ఏంటంటూ పలువురు నేతలు మండిపడ్డారు. పవన్ కూడా ఉత్తరాది వాళ్లకు దక్షిణాదిపై వివక్ష అంటూ తన పాత పాటను ఎత్తుకున్నారు. దీనిపై వెంకయ్యనాయుడు స్పందించి రుణమాఫీతో కేంద్రానికి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.
యూపీలో రైతు రుణమాఫీ ప్రకటనకూ, కేంద్ర ప్రభుత్వానికీ ఏ సంబంధమూ లేదని స్పష్టం చేశారు. ఆర్థిక వనరులను బట్టి ఆయా రాష్ట్రాలే రుణమాఫీ నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. ఈ విషయంలో ఉత్తరాది - దక్షిణాది అంటూ ప్రజల్లో భేదాభిప్రాయాలు తీసుకురాకూడదని ఆయన పవన్ కు సూచించారు.
అయితే.. రుణమాఫీ సంగతి యూపీ రాష్ర్ట ప్రభుత్వమే చూసుకుంటుందని అనుకున్నా కేంద్రం నుంచి సాయం చేయబోమని వెంకయ్య చెప్పగలరా? అన్న ప్రశ్న వినిపిస్తోంది. రుణమాఫీ చేసిన మిగతా రాష్ర్టాలకూ ఇంతేస్థాయిలో మద్దతు ఇస్తారా అన్నది కూడా చెప్పాలంటున్నారు. పవన్ అడిగిందాంట్లో తప్పేమీ లేదని అంటున్నారు. ఏపీలో రుణమాఫీని వ్యతిరేకించిన ప్రధాని యూపీలో రుణమాఫీని హైలైట్ చేసి ఓట్లుగా మలచుకున్నారన్నది అందరికీ తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/