ఏలూరు యువ భేరీ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి సహా ఆ అధికారంలో భాగస్వామ్యం పంచుకుంటున్న బీజేపీలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ఐదేళ్లు హోదా ఇస్తామంటే, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, టీడీపీలు ఐదేళ్లు చాలదు, పదేళ్లు కావాలని అని ఇపుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. ఇదే బీజేపీ.. ఇదే అరుణ్ జైట్లీ, ఇదే వెంకయ్య నాయుడు రాజ్యసభలో నినాదాలు చేసిన దశనుంచి ఇపుడు ప్యాకేజీలతో పక్కన పెట్టిన వరకు ప్రత్యక్షపాత్ర కలిగి ఉన్నారని జగన్ మండిపడ్డారు.
ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయని ఎన్నికల్లో చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత నాయకులు ప్లేట్లు మారుస్తున్నారని జగన్ మండిపడ్డారు. జరుగుతున్న పరిణామాలు చూస్తే బాధ అనిపిస్తుందని అందుకే ప్రత్యేక హోదా కోసం రెండున్నరేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నామని జగన్ తెలిపారు. ఏలూరులో పోరాటం కొనసాగిస్తూ ముందడుగు వేద్దామని జగన్ ప్రతిపాదించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అర్ధరాత్రి ప్రెస్‌మీట్ పెట్టి దమ్మిడీ ఇస్తామని చెప్పలేదు గానీ, హోదా ఇవ్వబోమని చెప్పగా అర్ధరాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే తాను స్వాగతిస్తున్నాను అనటం విస్మయం కలిగించిందని జగన్ అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెబితే స్వాగతించాడంటే చంద్రబాబుకు ఇంగ్లిష్ రాదేమోనని భావించినట్లు జగన్ తెలిపారు. ఢిల్లీ వాళ్లు ఏమిచ్చినా, ఏం ఇవ్వకపోయినా తాను మాత్రం వాళ్ల కాళ్లు వదలననే స్థాయిలో చంద్రబాబు రాజీ పడిపోయారని జగన్ మండిపడ్డారు. వ్యక్తిత్వాన్ని అమ్మేసి.. ఈ స్థాయిలో దిగజారిపోడానికి చంద్రబాబు ఈరెండున్నరేళ్లలో ఓటుకు కోట్ల కేసులో ఇరుక్కోవడమే కారణమని జగన్ విమర్శించారు. ముఖ్యమంత్రి స్వయంగా పాలుపంచుకొని నల్లధనాన్ని సూట్ కేసుల్లో ఇస్తూ ఆడియోటేపుల్లో అడ్డంగా దొరికిపోయినా ఆయన అరెస్టు కాలేదంటేనే ఇది అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. అధికారం కోసం సొంత మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచినట్లు, తన స్వార్థం కోసం రాష్ట్రానికి కూడా వెన్నుపోటు పొడుస్తాడని జగన్ మండిపడ్డారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీపై సైతం జగన్ విమర్శలు చేస్తున్నారు. ప్రణాళికా సంఘం రద్దయినప్పటికీ నీతి ఆయోగ్ రావడం వల్ల ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామని మరో అబద్ధం చెబుతున్నారని జగన్ మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం ఉన్నది కేవలం నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌కేనని, దాని అధ్యక్షుడు ప్రధానమంత్రి, ప్లానింగ్ కమిషన్‌కు, నీతి ఆయోగ్‌కు, ఎన్‌డీసీకి కూడా అధ్యక్షుడు ప్రధానమంత్రేనని విషయం మర్చిపోయారా అంటూ నిలదీశారు. అన్నింటికీ ప్రధానమంత్రే నిర్ణయాధికారి అయినప్పుడు.. ఆయన ఒక సంతకంతో చేసే నిర్ణయాన్ని కేబినెట్ నిర్ణయం అంటారా.. వేరే ఏమైనా అంటారా అని జగన్ మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అందుకోసం ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని జగన్ ప్రకటించారు.